»Nipah Virus Why New Virus Found Every Time In Kerala Know All Detail
Kerala: ప్రతిసారీ కొత్త వ్యాధులన్నీ కేరళలోనే ఎందుకు వెలుగులోకి వస్తున్నాయి
కేరళ భౌగోళిక స్థానాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. మానవులలో చాలా వ్యాధులు జంతువులతో సంపర్కం కారణంగా సంభవిస్తాయి. కేరళలో ఒకవైపు అడవి, మరోవైపు సముద్రం. రెండింటిలోనూ వివిధ రకాల జంతువులు ఉన్నాయి. వాటితో సన్నిహిత్యం కారణంగా ఆ వ్యక్తి వ్యాధికి గురవుతాడు.
Kerala: కొన్నేళ్లుగా ఎన్నడూ లేని విధంగా కేరళలో కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. వాటిలో చాలా పేర్లు మొదటి సారి వినిపించాయి. మంచి విషయం ఏమిటంటే, ఈ వ్యాధులన్నీ సకాలంలో నియంత్రించబడ్డాయి. గత కొద్దిరోజులుగా కేరళలో నిపా మరోసారి విలయతాండవం చేస్తోంది. కేరళకు కేంద్ర బృందాన్ని పంపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలిపారు. నిపా కారణంగా కేరళలో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు. మరికొంత మంది ప్రమాదంలో ఉన్నట్లు భావిస్తున్నారు. అనుమానితుల నమూనాలను పూణేకు పంపారు. అక్కడ నుండి దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత కేసు గురించి మరింత సమాచారం అందుబాటులో ఉంటుంది.
కేరళలో మాత్రమే చాలా వ్యాధులు ఎందుకు వస్తున్నాయి?
దీనికోసం కేరళ భౌగోళిక స్థానాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. మానవులలో చాలా వ్యాధులు జంతువులతో సంపర్కం కారణంగా సంభవిస్తాయి. కేరళలో ఒకవైపు అడవి, మరోవైపు సముద్రం. రెండింటిలోనూ వివిధ రకాల జంతువులు ఉన్నాయి. వాటితో సన్నిహిత్యం కారణంగా ఆ వ్యక్తి వ్యాధికి గురవుతాడు. కేరళలో ప్రతి ఇంట్లో జంతువులను ఉంచే సంప్రదాయం కూడా ఉంది. ఇక విదేశాల గురించి మాట్లాడితే దక్షిణాఫ్రికాలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. అక్కడ కూడా రోజుకో కొత్త రోగాలు గుర్తిస్తున్నారు.
కేరళ వైద్య విధానం
కేరళ వైద్య విధానం కూడా ప్రాథమిక స్థాయిలో చాలా బాగుంది. దేశంలోనే ప్రాథమిక వైద్య విధానంలో కేరళ అగ్రగామిగా ఉంది. ప్రజలు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు, వారు స్వయంగా చికిత్స చేయకుండా స్థానిక వైద్యుడి వద్దకు వెళ్లడానికి ఇష్టపడతారు. సరైన పరీక్షలు, ఇతర విషయాల కారణంగా వ్యాధి త్వరగా తెలిసిపోతుంది. కేరళ నుండి కొత్త వ్యాధులను త్వరగా గుర్తించడం అదే కారణం.
నిపా వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
నిపా వైరస్ మొదట మలేషియాలో కనుగొనబడింది. ఇది జంతువుల నుండి మానవులకు వస్తుంది. జంతువులతో ముఖ్యంగా పందులతో ప్రత్యక్ష సంబంధంలో ఉన్న వ్యక్తులలో ఈ వ్యాధి అభివృద్ధి చెందుతుంది. ఈ వైరస్ వ్యాపించిన వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఇందులో ఎక్కువగా శ్వాసకోశ సమస్యలు కనిపిస్తాయి. ఇందులో దగ్గు, గొంతు నొప్పి ప్రధాన లక్షణాలు. మరణాల రేటు 50 నుండి 70 శాతం వరకు ఉంటుంది. కోవిడ్, నిపాలాంటి ప్రతి వైరస్ ప్రతిదీ కేరళ నుండి కనుగొనబడింది. దీంతో పాటు హెపటైటిస్ బి, చికున్‌గున్యా, జికా వైరస్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ర్యాట్ ఫీవర్, జపనీస్ ఎన్సెఫాలిటిస్ వంటి వ్యాధులను కూడా కేరళ నుంచి గుర్తించారు. కొంతమంది నిపుణులు కూడా బయటి నుండి చాలా మంది పర్యాటకులు కేరళకు వస్తారు అందుకే ఇక్కడ కొత్త వైరస్ లు పుట్టుకొస్తున్నాయంటున్నారు. ఉదాహరణకు 2019 సంవత్సరంలోనే 1.96 కోట్ల మంది పర్యాటకులు కేరళకు వచ్చారు. ఇది 2018 సంవత్సరం కంటే 17 శాతం ఎక్కువ.