»Other Defence Minister Is Missing In China What Will Happen
China:లో మరో మంత్రి మిస్సింగ్..అసలేం జరుగుతుంది?
ప్రముఖ కమ్యూనిస్టు దేశమైన చైనా(china)లో వరుసగా మంత్రులు అదృశ్యమవుతున్నారు. అయితే ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు? అధికారంలో ఉన్న అధ్యక్షుడి తీరును ప్రశ్నించినందుకే ఈ పనిచేయిస్తున్నారా? లేదా మరేదైనా కారణం ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Other defence minister is missing in China what will happen
చైనా(china)లో అధ్యక్షుడిగా షీ జిన్ పింగ్ అధికారం చేపట్టిన తర్వాత అక్కడి ప్రభుత్వంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా అధికార ప్రభుత్వంలోని మంత్రులే మాయం అవుతున్నారు. ఈ జాబితాలో చైనా రక్షణ మంత్రి(defence minister) లీ షాంగ్ఫు కూడా చేరారు. ఈయన గత నెలలో బీజింగ్‌లో జరిగిన చైనా-ఆఫ్రికా భద్రతా ఫోరమ్‌లోని సదస్సులో చివరిగా కనిపించారు. మరోవైపు రెండు వారాలుగా బహిరంగంగా కనిపించని చైనా రక్షణ మంత్రి జాడపై అమెరికా కూడా ప్రస్తావించింది. షాంగ్ఫు రక్షణ మంత్రిగా అతని బాధ్యతల నుంచి తొలగించబడ్డాడని అక్కడి ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. ఆ తర్వాత అతను ఇటీవల జరిగిన వియత్నామీస్, సింగపూర్ రక్షణ సమావేశాల్లో కూడా కనిపించలేదు. మార్చిలో లీ తన పదవికి నియమించబడటానికి ముందు, అతను సైనిక సేకరణ విభాగానికి నాయకత్వం వహించాడు.
అంతేకాదు మే నెలలో అక్కడి విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ కూడా కనిపించకుండాపోయారు(missing). ఆ తర్వాత కొన్ని రోజులకు అతని స్థానంలో వాంగ్ యికి అధికారాలు ఇచ్చారు. ప్రస్తుతం షాంగ్ ఫూ విషయంలో కూడా అలాగే జరిగే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. అయితే యుఎస్-చైనా సైనిక సంబంధాలలో లీ “రోడ్‌బ్లాక్” అయినప్పటికీ, అతని గురించి వివరించలేకపోతున్నారు. ఈ క్రమంలో చైనా ఇతర మార్గాల్లో అంతర్జాతీయ సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోందని నిపుణులు అంటున్నారు. ఇరుపక్షాల మిలిటరీల మధ్య మెరుగైన చర్చల ఆంక్షలను తొలగించాలని చైనా అధికారులు పదే పదే చెబుతున్నారని తెలుస్తోంది. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ క్యాబినెట్ చేసిన తప్పుల గురించి రక్షణ శాఖ మంత్రి ప్రశ్నలను లేవనెత్తే అవకాశం ఉందని.. అందుకే లీ రెండు నెలల నుంచి కనిపించడం లేదని మరికొంత మంది అంటున్నారు. తక్కువ సమయంలో లీ ప్రజల దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నారని చెబుతున్నారు.