తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశ ప్రజల క్షేమం, రైతుల శ్రేయస్సు కోసం ప్రార్థించినట్లు తెలిపారు. ఉగాది సందర్భంగా వేంకటేశుని ఆశీస్సుల కోసం వచ్చానన్నారు. ప్రపంచమంతా యుద్ధభూమిలో ఉంటే భారత్ సేఫ్ జోన్లో ఉందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆధ్యాత్మికత, శాంతి, అభివృద్ధి నడుస్తోందన్నారు.