MDCL: ఉప్పల్లో కబ్జాలను తాకకుండా చెరువు అభివృద్ధి చేయడం వల్ల అసలు విస్తీర్ణం తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. నల్లచెరువు మొత్తం సుమారు 120 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం కేవలం 55 ఎకరాల పరిధిలోనే రూ. 20 కోట్లతో సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. కబ్జాలను తొలగించి పూర్తి విస్తీర్ణాన్ని పరిరక్షిస్తేనే చెరువు అసలు రూపు ఉంటుందని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు.