»Bigg Boss Telugu 7 Promo 1 Day 13 Nagarjuna King Meter Results
Bigg Boss: పల్లవిప్రశాంత్ రైతే కాదన్న నాగార్జున.. హీట్ పెంచిన తాజా ప్రోమో
బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో వచ్చేసింది. మీటర్ రిజల్ట్ అనే టాస్క్‌తో హౌస్‌లో ఉన్న వ్యక్తల ఆట తీరును నాగార్జున చెప్తున్నారు. పల్లవిప్రశాంత్ విషయంలో మీటర్ రెడ్‌పై పెట్టి నువ్వు అసలు రైతువేనా అని కొప్పడ్డారు.
Bigg Boss Telugu 7 Promo 1 - Day 13 Nagarjuna King Meter results
Bigg Boss: గత సీజన్‌తో పోల్చితే బిగ్ బాస్ 7 (Bigg Boss Telugu 7 ) కాస్త బెటర్ అంటున్నారు ప్రేక్షకులు. ఇందులో బిగ్ బాస్ ఇచ్చే కాన్సెప్ట్స్ మాత్రమే కాదు కంటెస్టెంట్స్ ప్రవర్తన కూడా రోజుకో రకంగా ఉంది. రెండవ వారంలో ఎలిమినేషన్ నుంచి బయటపడేసి మరొక నాలుగు వారాల పాటు ఇమ్యూనిటీ ఇచ్చే పవర్ ఆస్త్రా దక్కించుకోవడం కోసం మాయా అస్త్రాన్ని సంపాదించిన టీం లోని ఆరుగురు మధ్య గట్టి పోటీ నడిచింది. ఫైనల్ గా వీళ్ళ ఆరుగురిలో శివాజీ (Shivaji), షకీలా (Shakeela) పవర్ అస్త్ర సంపాదించడానికి అర్హత పొందారు. తాజాగా ప్రోమో విడుదల అయింది. వీకెండ్ స్టార్ట్ అవడంతో కింగ్ నాగార్జున (Nagarjuna) వచ్చేశాడు. మీటర్ రీడింగ్ ఆధారంగా హౌస్‌లోని కంటెస్టెంట్ల ఫార్ఫార్మెన్స్ గురించి వివరించాడు. శివాజీతో మాట్లాడుతూ.. డోర్ తీయడానికి ఎంత సమయం పడుతుంది. పులిమీద స్వారీ చేసేప్పుడు మొత్తం ప్రయాణం చేయాలి. మధ్యలో దిగిపోకూడదని అంటాడు. పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) ఆట గురించి మాట్లాడారు. తనకు ఇచ్చిన మొక్క ఎండిపోయింది. ఒక మొక్కనే చూసుకొని నువ్వు రైతు ఎలా అవుతావని గట్టిగా అనేశాడు. దీంతో ప్రశాంత్ షాక్ అవుతారు. రసవత్తరంగా ఉన్న ఈ ప్రమో చూస్తుంటే ఈ వీకెండ్ ప్రేక్షకులకు మంచి స్టఫ్ దొరికింది అనిపిస్తుంది.