ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అనంత నాగ్ సంగీత్ స్వర్గ్ కల్చరల్ అసోసియేషన్, సంస్కార భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీప ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. మైఖేల్ బాబు నిర్వహించిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి.