NDL: ఉగాది అనంతరం శ్రీశైలంలో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. జిల్లా ఎస్పీ సునీల్ షౌరాణ్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. బ్లూకోర్ట్ వాహనంలో వెళ్లి డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టి, కీలక ట్రాఫిక్ పాయింట్ల వద్ద సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అలాగే, రద్దీని నియంత్రించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.