అన్నమయ్య జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు శుక్రవారం యథావిధిగా కొనసాగుతాయని DEO సుబ్రహ్మణ్యం గురువారం తెలిపారు. నేడు ఎటువంటి సెలవు లేదని స్పష్టం చేశారు. శనివారం రంజాన్ పండుగ సందర్భంగా సెలవు ఉంటుందని వెల్లడించారు. అదే రోజు నిర్వహించాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా వేసినట్లు వెల్లడించారు.