KRNL: మంత్రాలయం, సంవత్సరాది ఉగాది పండుగ అందరిలో సుఖసంతోషాలు నింపాలని, శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు సుభుదేంద్రతీర్థులు ఆశిస్సులు అందించారు. గురువారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ మఠంలో పీఠాధిపతులకు తైల అభ్యంజనం చేసిన తరువాత తులసి పూజ, గోపూజతో పాటు రాఘవేంద్రస్వామి ఆరాధ్య దైవమైన మూల రాములకు తైలా అభ్యంగాణాన్ని ప్రదర్శించారు.