»Karthikeya Average Hit Makes Hero Cancel Three Projects
Karthikeya: మూడు సినిమాలు రిజెక్ట్ చేసిన కార్తికేయ..?
ఆర్ఎక్స్100 హీరో కార్తికేయ నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా బెదురులంక 2012. రీసెంట్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివ అనే పాత్రలో కనిపించాడు. క్లాక్స్ దర్శకత్వం వహించారు. కాగా, తన చుట్టూ జరుగుతున్న మోసాలను అరికట్టే పాత్రలో కార్తీకేయ అదరగొట్టాడు.
రీసెంట్ గా విడుదలైన బెదురులంక 2012 మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరీ ఎక్కువ కలెక్షన్లు రాబట్టకపోయినా, మూవీ మాత్రం ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. కానీ ఈ మూవీ తర్వాత కార్తికేయ మాత్రం ఒకటి ఫిక్స్ అయ్యాడు. ఇక వచ్చే సినిమాలన్నీ కామెడీ జోనర్ లోనే చేయాలని ఫిక్స్ అయిపోయాడు. కార్తికేయ ఇటీవలి కాలంలో యాక్షన్ జానర్లో 2-3 చిత్రాలను ఓకే చేసినట్లు తెలుస్తోంది. కానీ బెదురులంక విజయంతో ప్రేక్షకులకు నచ్చేది కామెడీ అని హీరో ఫీల్ అయ్యాడు. ఇక నుంచి హాస్యభరితమైన సినిమాలే చేయాలనుకుంటున్నాడు.
కార్తీకేయ మూడు ప్రాజెక్ట్‌లను రద్దు చేసి, ఇప్పుడు కామెడీ స్క్రిప్ట్‌ల కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే అతని చేతిలో UV క్రియేషన్స్ ఓ సినిమా చేస్తోంది. మరోవైపు బెదురులంక 2012 వర్కవుట్ అయిందని, కార్తికేయకు మళ్లీ కామెడీ చిత్రం పని చేస్తుందనే గ్యారెంటీ లేదు. స్క్రీన్‌ప్లే ఎక్సైటింగ్‌గా, కథనం ఆసక్తికరంగా ఉంటే అది కామెడీ, హర్రర్, యాక్షన్ లేదా ఏదైనా మెలోడ్రామా అయినా ఖచ్చితంగా ఏ సినిమా అయినా పని చేస్తుంది. ఆ లాజిక్ కార్తీకేయ అర్థం చేసుకుంటాడో లేదో చూడాలి.