సూర్యాపేట జిల్లాకు వారబంది పద్ధతిలో వస్తున్న శ్రీరాంరెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరాంసాగర్ రెండో దశ (శ్రీ ఆర్డిఆర్ ఎస్సారెస్పీ) జలాలు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నిలిచిపోయాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని బయ్యన్న వారు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నిబంధనల ప్రకారం అధికారులు గేట్లను మూసివేశారు. తిరిగి ఈనెల 27న మరల గేట్లను తెరవనున్నారు.