KDP: చింతకొమ్మదిన్నె మండలం కొత్తపేటలో ఉగాది సందర్భంగా గురువారం గంగమ్మ తల్లి ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది. శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని శాకాంబరీ దేవి అలంకరణలో అలంకరించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.