KRNL: నందవరం మండలం నాగలదిన్నె జడ్పీ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం-2026 వరించింది. గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేతుల మీదుగా అవార్డు పొందారు.