వేగంగా వెళ్తున్న అంబులెన్స్ వాహనం ప్రమాదవశాత్తు ఆగిఉన్న పాల వ్యానును ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు విషయం తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషాదఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలోని తవనంపల్లి మండలం తెల్లగుండ్లపల్లి పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేశాడా? లేదా మద్యం సేవించి అంబులెన్స్ నడుపుతున్నాడా? అసలు ప్రమాదానికి కారణం ఏంటి అనే విషయాలపై పోలీసులు వివరాలను ఆరా తీస్తున్నారు.