సత్యసాయి: ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం గ్రామంలో అకాల వర్షం, ఈదురుగాలుల వల్ల ఐదు ఎకరాల అరటి పంట నేలకొరిగింది. రైతు రామ్మోహన్‌కు చెందిన తోటను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గురువారం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడుసార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా రైతులకు ఎటువంటి సాయం అందలేదని విమర్శించారు.