PPM: జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన్యం లీగ్స్-2026’ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ గురువారం స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. మొదటి రోజు మొత్తం నాలుగు ఉత్కంఠభరిత మ్యాచ్లు జరిగాయి.