MNCL: జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ముస్లిం కుటుంబాలకు గురువారం రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. అనంతరం మసీదు ప్రాంగణంలో వాటర్ షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, నియోజకవర్గంలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.