CTR: కుప్పంలో ఉగాది వేడుకలు విలక్షణమైన ఆధ్యాత్మికతతో సాగాయి. తమిళ సంస్కృతీ సంప్రదాయాల కలయికతో ఇక్కడి ప్రజలు తమ పితృదేవతలకు ఘనంగా నివాళులర్పించారు. మరణించిన తమ పూర్వీకులను స్మరిస్తూ, కుటుంబ సభ్యులందరూ శ్మశానాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. ముఖ్యంగా ఉగాది పచ్చడిని వారికి నైవేద్యంగా సమర్పించి భక్తిని చాటుకున్నారు. పండుగ రోజు పెద్దల ఆశీస్సులు తీసుకోవడం విశేషం.