AP: అకాల వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలతో 1,215 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఆరు జిల్లాల్లోని 16 మండలాలపై అధిక ప్రభావం ఉండనుంది. మరో 267 హెక్టార్లలోని ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. వర్షం వల్ల జరిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలను సీఎంకు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో పంటనష్టాన్ని లెక్కించాలని సీఎం సూచించారు.