AKP: ఎలమంచిలి మండలం పులపర్తి గ్రామంలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ తాటాకు ఇళ్లు దగ్ధం అయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారి రాంబాబు తెలిపారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో రూ. లక్ష మేర ఆస్తి నష్టం జరిగిందన్నారు.