NDL : మహానంది దేవస్థాన అర్చకుడు ఆర్వీ.శేషయ్య శర్మకు ఉగాది పురస్కారం ఇవాళ లభించింది. గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ అర్చకులకు అందించే ఈ గౌరవం ఆయనకు దక్కింది. ఈ మేరకు వేద పండితులు, అర్చకులు, సిబ్బంది ఆయనను అభినందించారు.