NDL: గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించిన ఎద్దుల బల ప్రదర్శన పోటీలను రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ గురువారం ఘనంగా ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ సంప్రదాయాలను కాపాడటంలో ఇలాంటి పోటీలు ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.