KRNL: కోసిగి పట్టణంలో రూ.2.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రాలయం TDP ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి నేడు భూమిపూజ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి చింతకుంట రోడ్ రంగప్పగట్టు వరకు రూ.కోటితో CC డ్రైన్, వివిధ కాలనీలలో రూ.85 లక్షలతో CC రోడ్లు, సజ్జలగుడ్డం రోడ్ నుంచి మోడల్ స్కూల్ వరకు రూ.30 లక్షలతో CC రోడ్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.