విశాఖ జర్నలిస్ట్స్ ఫోరమ్ (APWJF) అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఉగాది పురస్కారాన్ని ప్రకటించింది. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. మీడియా రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.