TG: పేదల బడ్జెట్ను ఆర్థిక మంత్రి, Dy.CM భట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోతున్నారని మంత్రి వివేక్ అన్నారు. రూ.8లక్షల కోట్ల అప్పులను రాష్ట్రంపై BRS మోపిందని ఆరోపించారు. రూ.3 లక్షల కోట్ల అప్పులు, మిత్తి చెల్లించామని తెలిపారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చామన్నారు. ఇది అన్ని వర్గాలు మేలు జరిగే బడ్జెట్ అని పేర్కొన్నారు.