VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం ఉగాది పర్వదినం పురస్కరించుకుని వారి స్వగ్రామం వీన్ పురంలో కుటుంబ సభ్యులు, రైతులతో కలిసి సంస్కృతి, సాంప్రదాయాల్లో భాగంగా పశువులను పూజించి నాగలితో భూమిని దున్ని ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. ప్రజలందరూ కొత్త ఆరంభం, కొత్త ఆశలతో మరింత అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.