»Change Of Name Of India Name Central Minister Anurag Thakur Clarity
Anurag thakur: ఇండియా పేరు మార్పు..కేంద్ర మంత్రి క్లారిటీ
గత కొన్ని రోజులుగా భారతదేశం పేరు మారుతుందని వచ్చిన వార్తలపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఇండియా పేరు భారత్(bharat)గా మార్చడం అనేది అసలు లేనే లేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(anurag thakur)స్పష్టం చేశారు. దీనిపై అసలు నిజం తెలుసుకోకుండా అనేక మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే అసలు నిజాలు ఎంటీ? నిజంగా ఇండియా పేరు మారడం లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Change of name of India name Central minister anurag thakur clarity
మరికొన్ని రోజుల్లో భారత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18న జరగనున్నాయి. ఈ క్రమంలోనే భారత రాష్ట్రపతి కాకుండా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్(bharat)’ పేరుతో కేంద్ర ప్రభుత్వం G20 సమ్మిట్ ఆహ్వానాల పత్రాల్లో ఉండటంతో దేశవ్యాప్తంగా ఇండియా పేరు మారుతుందని వివాదం చెలరేగింది. అంతేకాదు ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార బీజేపీని విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. అంతేకాదు ప్రజలు కూడా ఇండియా పేరు మారుతుందని అనుకున్నారు. మరికొంత మంది అయితే కాంగ్రెస్ ఇండియా కూటమి అని పేరు పెట్టుకుందని.. పేరు మార్చుతున్నట్లు ప్రచారం చేశారు. అయితే ఇలాంటి పుకార్ల నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(anurag thakur) క్లారిటీ ఇచ్చారు.
అసలు భారతదేశం పేరును భారత్‌గా మార్చడం అనే అంశం లేనే లేదని కేంద్ర మంత్రి(central minister) స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో భారతదేశం అని వ్రాయబడినట్లు చెప్పారు. ఎప్పుడో భారత్ అని ఉందని..అనగా రాష్ట్రాల యూనియన్‌గా పిలుస్తున్నామని వెల్లడించారు. మన రాజ్యాంగాన్ని సెప్టెంబరు 18, 1949న రాజ్యాంగ సభ ఆమోదించిందని గుర్తు చేశారు. ఇది ఎప్పటి నుంచో మన రాజ్యాంగంలో స్పష్టంగా భారతదేశం, అది భారత్ ఉందని మరోమారు తెలిపారు. అనేక మందికి భారత రాజ్యాంగం గురించి సరిగా అవగాహన లేదు కాబట్టి ఇది తెలియలేదని అన్నారు. ఈ క్రమంలో G20 ఆహ్వాన పత్రాల్లో భారత్ అనే పేరు ఉంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. భారత్ అనే పేరు వేల ఏళ్లుగా వాడుకలోనే ఉంది. కాబట్టి భారత్‌కి కొత్త పేరు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఈ క్రమంలో తాను భారత్ సర్కార్ మంత్రిని అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఈ అంశంపై పలు న్యూస్ ఛానల్స్ పూర్తిగా తెలుసుకోకుండా అనవసర రాద్ధంతం చేస్తున్నాయన్నారు. భారత్ అనే పేరుంటే అసలు ఎందుకు అభ్యంతరమన్నారు. భారత్ అనే పేరును ఎవరు వ్యతిరేకిస్తున్నారనేది ప్రజలు ఆలోచించాలని సూచించారు.
మరోవైపు ఈ అంశంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(s jaishankar) గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘భారత్’ అనేది భారత రాజ్యాంగంలో అర్థాన్ని కలిగి ఉందని స్పష్టం చేశారు. భారతదేశం అంటే భారత్ అని అది రాజ్యాంగంలోనే ఉందన్నారు. అంతేకాదు దయచేసి ప్రతి ఒక్కరు రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని, దానిని చదవాలని జైశంకర్ కోరారు.