W.G: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈఓ నారాయణ తెలిపారు. బుధవారం నిర్వహించిన హిందీ పరీక్షకు మొత్తం 22,858 మంది విద్యార్థులకు గాను 22,505 మంది హాజరుకాగా, 353 మంది గైర్హాజరయ్యారని వివరించారు. అలాగే ఓపెన్ స్కూల్ ఆంగ్ల పరీక్షకు 253 మందికి 215 మంది హాజరయ్యారని, 38 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.