JGL: గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఏడాది బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ గల్ఫ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు మంద భీం రెడ్డి (జగిత్యాల) ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతి పత్రం సమర్పించారు. గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.