NLR: నెల్లూరులో లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీప్రణతి ఫ్లోరా ఆధ్వర్యంలో నెల్లూరు పరిధిలోని 2 పాల కేంద్రాలపై దాడులు చేశారు. పాల నమూనాలను సేకరించారు. విడవలూరు మండల పరిధిలోని పాల కేంద్రాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.