MHBD: తెలంగాణ నుంచి ఇటీవల వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వేం నరేందర్కి ప్రియాంక శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి సిద్ధంగా తీసుకెళ్లాలని ఆమె సూచించారు.