»Sbi Good News For Senior Citizens And Phc Customers Free Doorstep Services
SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్..ఫ్రీగా డోర్స్టెప్ సర్వీసెస్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(sbi) తమ ఖాతాదారుల కోసం సరికొత్త సర్వీస్(doorstep banking services) ను అందుబాటులోకి తెచ్చింది. ప్రధానంగా సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ఫ్రీగా డోర్స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఈ సేవలు కావాలంటే బ్యాంకింగ్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని వెల్లడించారు.
SBI Good news for senior citizens and phc customers Free Doorstep Services
ఇండియాలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు మరొక డోర్స్టెప్ సర్వీస్(doorstep banking services) ను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు ఈ సేవలు ఉచితంగా ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. అయితే ఈ సౌకర్యం 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్స్, వికలాంగ వినియోగదారులకు అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఎటువంటి ఛార్జీలు లేకుండా వారి ఇళ్లలో సౌకర్యవంతంగా బ్యాంకింగ్ సేవలను పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవ నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు, చెక్ డిపాజిట్లతో సహా వివిధ లావాదేవీలు అందిస్తామని అన్నారు.
అయితే దీనికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. కస్టమర్లు రోజుకు ఒక లావాదేవీని మాత్రమే నిర్వహించగలరు. గరిష్ట నగదు పరిమితి రూ.20,000 నుంచి కనిష్టంగా రూ.1,000 వరకు ఉంటాయన్నారు. అదనంగా ఈ సదుపాయాన్ని యాక్సెస్ చేయడానికి మీ SBI బ్రాంచ్ మీ ఇంటికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండాలని కండీషన్ పెట్టారు. దీంతోపాటు ఈ సేవకు పరిమితి కూడా ఉంది. ఇది నెలకు మూడు సార్లు అందించబడుతుంది. ఈ సౌకర్యవంతమైన సేవను యాక్సెస్ చేయడానికి, కస్టమర్లు డోర్స్టెప్ బ్యాంకింగ్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ఆసక్తి కల్గిన ఎలాంటి సపోర్ట్ లేని వినియోగదారులకు ఈ సౌకర్యం కచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.