TG: కూల్చివేతలపై గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వినిపించారు. నోటీసులు ఇవ్వకుండానే ఆక్రమణలు కూల్చుతామని కేసీఆర్ అన్నట్లు తెలిపారు. నాలాలపై నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చాలని చెప్పారన్నారు. BRS ప్రభుత్వం కార్యాచరణనే తమ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. గతంలో వాళ్లు చెప్పిన మాటలనే ఇవాళ తప్పుపడుతూ దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు.