WNP: వేసవిని దృష్టిలో ఉంచుకుని వనపర్తి పట్టణంలోని తాగునీటి సరఫరాపై ఎమ్మెల్యే మేఘారెడ్డి బుధవారం మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాగునీటికి సంబంధించిన పలు అంశాలపై అధికారులతో చర్చించారు. మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారం రోజుల్లో తాగునీటి సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలని సూచించారు.