ASR: కొయ్యూరు మండలం కర్ణికపాలెం, చింతలపూడి, పిట్టలపాడు, రేవులకోట తదితర అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్న గ్రామాల్లో బుధవారం రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఏవో పీ.శివరామ్ ప్రసాద్ తెలిపారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో విత్తనాల ఎంపిక, సాగునీటి వాడకం, నీటి భద్రత అంశాలపై అవగాహన కల్పించారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల గురించి వివరించారు.