»Rajasthan Man Thrashes Strips Wife On Camera Arrested
Rajasthanలో దారుణం.. భార్య బట్టలూడదీసి వీడియో, భర్త అరెస్ట్
గర్భవతి అని కూడా చూడకుండా.. ఓ మహిళను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతోంది. భర్త సహా మరొ ఇద్దరిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Rajasthan man thrashes.. strips wife on camera, Arrested
Rajasthan: ప్రపంచంలో కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి.. అయినప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. ఇప్పటికీ పాత పోకడలను మరవడం లేదు. సాంప్రదాయం పేరుతో.. గౌరవం పేరుతో దారుణాలు చేస్తున్నారు. పెద్దలే తమ బిడ్డల చేత ఇలా చేయిస్తున్నారు. రాజస్థాన్ (Rajasthan)లో ఇలాంటి ఘటన జరిగింది. భార్య బట్టలూడదీసి, వీడియో తీసి.. ఊరేగించాడు ఓ భర్త. పేరంట్స్ అలా చేయమని చెప్పడంతో చేశాడు. అతనికి స్నేహితులు కూడా సహకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. ప్రభుత్వం వెంటనే స్పందించి.. తగిన చర్యలు తీసుకుంది.
చదవండి: Cinema పేరుతో ఛీటింగ్.. ఆపై వ్యభిచార కూపంలోకి.. 4 నెలల గర్భవతి
ప్రతాప్ ఘడ్ జిల్లాకు చెందిన కనా మీనాకు గత ఏడాది పెళ్లి అయ్యింది. అతని భార్య నాలుగు నెలల గర్భవతి.. కొద్దిరోజుల క్రితం ఆమె ఊరు విడిచి వెళ్లిపోయింది. ఇంటి పక్కనే ఉండే మరొకరితో లేచి పోయినట్టు తెలిసింది. ఆ విషయం ఊరంతా తెలిసింది. ఆమె జాడ కనుక్కొని, ఇంటికి తీసుకొని రావాలని అనుకున్నారు. ఇంకేముంది.. ఆగస్ట్ 31వ తేదీన తీసుకొచ్చారు. ఎలాగైనా సరే బుద్ది చెప్పాలని అనుకున్నారు. అందుకు నీచంగా ఆలోచించారు. మీనాకు అలా చేయమని పేరంట్స్ చెప్పడంతో కానిచ్చేశాడు.
బట్టలూడదీసి
ఇంటి బయట భార్య బట్టలు ఊడదీశాడు. అందుకు వివాహిత నిరాకరించింది. అయినా సరే.. కత్తి తీసుకొని మరీ ఫైజామా ప్యాంట్ ఊడదీశాడు. తర్వాత టాప్ కూడా తీసి.. దానిని వీడియో తీశాడు. అతనికి ఏడుగురు సహకరించారని తెలిసింది. వీడియో తీసిన తర్వాత.. బట్టలు లేకుండా ఆమెను ఊరేగించారు. భర్త ఉండగా.. మరొకరితో లేచి పోతావా అని అలా చేశారు. ఆ వీడియో ఒకరి నుంచి మరొకరికి చేరింది. అలా వైరల్ అవడంతో రాజస్థాన్ (Rajasthan) సీఎం వరకు వెళ్లింది. వెంటనే భర్త, అతని కుటుంబీకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. అలాంటి వారికి ఈ నాగరిక సమాజంలో చోటు లేదని స్పష్టంచేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి.. కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఆ వివాహిత భర్త సహా వెలియా మీనా, నాథు మీనా అనే ఇద్దరినీ శనివారం అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేస్తాం
మీనాకు సహకరించిన మరికొందరినీ అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆ వీడియోను సర్క్యులేట్ చేయొద్దని స్థానికులను కోరారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ ముగ్గురికి గాయాలు అయ్యాయి. అరెస్ట్ చేసే సమయంలో తప్పించుకున్నారని.. అందుకే గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఆస్పత్రి నుంచి తీసుకొచ్చే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసులు బుద్ది చెప్పారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. మరొకరు ఇలా చేయాలనే ఆలోచన రాకుండా చూడాలని కోరారు.
Three accused have been arrested for allegedly stripping and parading a tribal woman naked at a village in Rajasthan's Pratapgarh. The accused got injured while trying to run away as police chased them.pic.twitter.com/nHfFzgirXN
10 మందిపై చర్యలు..?
రాజస్థాన్లో (Rajasthan) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. ఆ కామెంట్లను అధికార కాంగ్రెస్ తిప్పికొట్టింది. కఠిన చర్యలు తీసుకుంటున్నామని తేల్చిచెప్పింది. మీనా ఫ్యామిలీపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ మహిళ పట్ల అలా వ్యవహరిస్తావా అని ఫైరయ్యారు. ఇష్టం లేకుంటే వదిలేయాల్సింది.. విడాకులు తీసుకోవాల్సిందని సూచించారు. మహిళను వివస్త్రను చేసి, ఊరేగించి.. ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఆ 10 మందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.