Cinema Offers: రంగుల ప్రపంచంలో అవకాశాలు అంటూ ఊరిస్తారు. సినిమాల్లో, సీరియల్స్‌లో ఛాన్స్ వస్తుందని అనుకొని చాలా మంది వస్తారు. అలా హైదరాబాద్ వచ్చే వారు బాగానే ఉన్నారు. వారి వీక్నెస్తో కొందరు ఆడుకుంటున్నారు. సినిమా (Cinema) ఛాన్స్ అని చెప్పి.. చివరికీ వ్యభిచార కూపంలోకి నెడుతున్నారు. మాదాపూర్ (madhapur) రేవ్ పార్టీ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.
రేవ్ పార్టీ భగ్నం
మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ జరిగింది. దానిని టీఎస్ న్యాబ్ పోలీసులు (police) రేవ్ పార్టీని భగ్నం చేశారు. సినిమా ఛాన్స్ అని అమ్మాయిలు.. రేవ్ పార్టీ పేరుతో ప్రముఖులకు ప్రధాని నిందితుడు కాపా భాస్కర్ బాలాజీ (bhaskar balaji) ఎరవేశాడని పోలీసులు చెబుతున్నారు. బాలాజీతో కారుమూరి వెంకటరత్నారెడ్డి, మురళి కలిసి దందా సాగించారని వివరించారు. వీరి వద్ద సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధించిన పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. కేసులో 24 మందిని నిందితులుగా చేర్చారు. నిమ్ నేమ్స్‌తో దందా సాగిస్తున్నారని గుర్తించారు.
25 కేసులు
ఏ2 కారుమూరి వెంకటరత్నారెడ్డి స్వస్థలం గుంటూరులో గల నెహ్రూనగర్.. అతను డీఆర్ఐ అధికారిగా చెప్పుకుంటారు. నిర్మాతలతో ఫ్లైట్ టికెట్స్, హోటల్ బిల్ కట్టించేవాడు. పెళ్లిళ్ల పేరుతో ప్రవాసాంధ్రులను మోసం చేశాడని తెలిసింది. ఇప్పటికే 25కు పైగా కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కొన్ని కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడని తెలిసింది. ఈజీ మనీ కోసం నిర్మాత అవతారం ఎత్తాడు. అలా అమ్మాయిలను ట్రాప్‌లో దింపేవాడు. హైదరాబాద్ తీసుకొచ్చి వ్యభిచార కూపంలోకి నెట్టేవాడని పోలీసుల విచారణలో తెలిసింది.
సినిమా ఆఫర్ల కోసం
యువతులను (women) తీసుకొని.. సిటీలో రేవ్ పార్టీ నిర్వహించేవారని పోలీసులు చెబుతున్నారు. అక్కడికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులను పిలిచి వల విసురుతున్నారని వివరించారు. ఇలా ఇద్దరినీ మోసం చేస్తున్నారని.. అందినకాడికి దోచుకున్నారు. టీఎస్ న్యాబ్ పోలీసులు రైడ్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి.. సినిమాల్లో నటించేందుకు యువతులు హైదరాబాద్ వచ్చేస్తున్నారు. అసలు వారు ఎవరు..? ఏం చేస్తారు..? ఇదివరకు సినిమాలు తీశారా… ఇండస్ట్రీలో పరిచయం ఉందా.? లాంటివి ఆలోచించడం లేదు. దీంతో వారి అమాయకత్వాన్ని ఇలాంటి వారు క్యాష్ చేసుకుంటున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా
మూవీ ఆఫర్లు (movie offers) అంటే నమ్మొద్దని ఎంత అవగాహన కల్పిస్తోన్న కొందరిలో అవగాహన రావడం లేదు. అలాంటి వారితో భాస్కర్, బాలాజీ, మురళి సంప్రదింపులు జరుపుతున్నారు. అప్పటికే తమకు తెలిసిన కొందరు సినీ ప్రముఖుల ఫోటోలు, వీడియోలు.. మొబైల్ నంబర్స్ చూపిస్తున్నారు. వారు చెప్పే మాయ మాటలను నమ్మిస్తున్నారు. తీరా.. హైదరాబాద్ వచ్చిన తర్వాత చుక్కలు చూపిస్తున్నారు. సినిమా లేదు ఏం లేదు.. డ్రగ్స్ ఇస్తూ, వ్యభిచార కూపంలోకి నెడుతున్నారు. వారి చెర నుంచి వెళ్లలేక.. అక్కడే మగ్గిపోతున్నారు. ఒకప్పుడు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఇలాంటివి జరిగేవి. ఇప్పుడు భాగ్యనగర నడిబొడ్డున ఇలాంటి కార్యకలాపాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తోన్న.. జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుంది.