»Hariharaveeramallu New Poster Released September 2nd 2023 Pawan Kalyan Crazy Look
HariHaraVeeraMallu: కొత్త పోస్టర్ రిలీజ్..ఉగ్రరూపంలో పవన్!
నేడు పవన్ కళ్యాణ్(PawanKalyan) పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అతని అభిమానులకు క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. పవన్ యాక్ట్ చేస్తున్న హరి హర వీర మల్లు(Hariharaveeramallu) మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్లో పవర్ స్టార్ అయితే అదిరిపోయే మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు.
Hariharaveeramallu new poster released september 2nd 2023 Pawan kalyan crazy look
ఎప్పటినుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ మూవీ ప్రాజెక్టులలో హరి హర వీర మల్లు(Hariharaveeramallu) కూడా ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(PawanKalyan) యాక్ట్ చేస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఈరోజు(సెప్టెంబర్ 2న) పవర్‌స్టార్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను శుక్రవారం అర్ధరాత్రి 12 తర్వాత రిలీజ్ చేశారు.
ఇక లేటెస్ట్ ఫోటోలో పవన్ కళ్యాణ్ చాలా కొత్త లుక్‌లో(new look) కనిపిస్తున్నాడు. నిండుగా గడ్డం, హెయిర్ స్టైల్, ఎరుపు, నలుపు రంగు కలిసిన ప్రత్యేక దుస్తుల్లో ఉన్నాడు. కుడి చేతికి కడెం, ఎడమ చేతికి నళ్ల దారంతో షర్ట్ పైకి మడిచి మాస్ లుక్‌లో ఉన్న పవన్ కల్యాణ్ ఉగ్ర రూపంలో కనిపిస్తున్నారు. అయితే ఆ పోస్టర్ చూస్తుంటే యాక్షన్ సీన్ కు సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ చిత్రంలో క్రిష్ పవన్ కళ్యాణ్‌ని మల్టిపుల్ లుక్స్‌లో ప్రెజెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. రానున్న రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియన్ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.