»After 20 Years The Blue Moon 2023 Will Appear August 30th And 31st 2023
Super blue moon: 20 ఏళ్ల తర్వాత నేడు కనిపించనున్న బ్లూ మూన్!
ఈరోజు (ఆగస్టు 30న) రాత్రి ఆకాశంలో అరుదైన దృశ్యం "బ్లూ సూపర్‌మూన్(super blue moon)" కనువిందు చేయనుంది. దశాబ్దానికి ఒకసారి మాత్రమే జరిగే ఈ అరుదైన దృగ్విషయం నిజంగా చూడదగ్గదని చెప్పవచ్చు. సూపర్ బ్లూ మూన్ కొంచెం పెద్ద పరిమాణంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సాధారణ పౌర్ణమి కంటే సూపర్మూన్లు దాదాపు 40% పెద్దగా, 30% ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
After 20 years the blue moon 2023 will appear august 30th and 31st 2023
నేడు ఖగోళంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కైవాచర్లు సూపర్ బ్లూ మూన్ అని పిలువబడే ఆకర్షణీయమైన ఖగోళ దృశ్యం కోసం వేచిచూస్తున్నారు. చంద్ర దృగ్విషయం ఆగష్టు 30 రాత్రి, ఆగష్టు 31, 2023 తెల్లవారుజామున ఏర్పడనుంది. సూపర్ బ్లూ మూన్ అనేది మూడు చంద్ర సంభవాల కలయిక. అంటే ఒక పౌర్ణమి, ఒక సూపర్‌మూన్, బ్లూ మూన్ కలిస్తే ఏర్పడుతుంది. బ్లూ మూన్(blue moon) అనేది మనం నెలలో రెండుసార్లు పౌర్ణమిని చూసినప్పుడు ఉపయోగించే పదం. అంతేకాదు ఇది హిందూ పండుగ అయిన రక్షా బంధన్ రోజు రావడం విశేషమని చెబుతున్నారు.
సూపర్ బ్లూ మూన్(super blue moon 2023) సరైన వీక్షణ కోసం చంద్రుడు ఉదయించిన వెంటనే సూర్యాస్తమయం తర్వాత సంధ్యా సమయంలో చంద్రుడిని చూడాలని అంటున్నారు. సూపర్ బ్లూ మూన్ ఆగస్ట్ 30న రాత్రి 8:37 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుందని నిపుణులు తెలిపారు. ఇండియాలో 9:30 PM IST నుంచి మొదలవుతుందని తెలిపారు. యూరప్‌లోని వీక్షకులు చంద్రుడిని కొంచెం ఆలస్యంగా చూసే అవకాశం ఉంటుందన్నారు. లండన్‌లో, చంద్రుడు రాత్రి 8:08 BSTకి ఉదయిస్తాడు. న్యూయార్క్‌లో, చంద్రోదయం రాత్రి 7:45 గంటలకు EDT. లాస్ ఏంజిల్స్ కోసం, PDT రాత్రి 7:36 గంటలకు చంద్రుడు ఉదయిస్తాడు. మీరు సూపర్ బ్లూ మూన్‌ను చూడాలని ఆశపడుతున్నట్లయితే, మీ ప్రాంతంలో చంద్రుని వీక్షించడానికి పరిస్థితులు సరిగా లేకుంటే, దానిని వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్‌లో ప్రత్యక్షంగా చూడవచ్చు.