TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. సిట్ అంటేనే కూర్చోవడమంటూ ఎద్దేవా చేశారు. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలిస్తామని రేవంత్ చెప్పినవన్నీ ఉత్త మాటలేనని, మరి ఫాంహౌస్‌కు డ్రగ్స్ ఎలా వచ్చాయని ప్రశ్నించారు.