Bigg Boss-7: బిగ్ బాస్ (Bigg Boss) ప్రోగ్రాంకు తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. మరో వారం రోజుల్లో బిగ్ బాస్ 7 (Bigg Boss-7) ప్రసారం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్లను ఫైనల్ చేశారని తెలిసింది. పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి.. కానీ ఆఫిషీయల్గా మాత్రం కాలేదు. ఈ సారి కూడా నాగార్జున (nagarjuna) హోస్ట్ (host) చేయనున్నారు. కంటెస్టెంట్లు కూడా సెలబ్రిటీలు రానున్నట్టు తెలిసింది. వారికి శృంగార తార షకీలా (shakeela) కూడా జత కలువనుందని సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
100 రోజుల పాటు హౌస్లో ఉండి.. అల్లరి చేస్తూ.. ఆడుతూ, పాడుతూ రచ్చ చేస్తారు కంటెస్టెంట్లు. కొన్ని జంటలు అయితే రొమాన్స్ చేస్తాయి. ఎక్కువ అల్లరి చేస్తే హైప్ అవుతారు.. ఓట్లు పడి, ఇంట్లో ఉంటారు. అలా టైటిల్ కొట్టే అవకాశం ఉంటుంది. ఈ సారి అందరూ రొమాంటిక్ స్టార్లు రానున్నట్టు తెలిసింది. వారిలో షకీల పేరు కూడా వినిపిస్తోంది. షకీల అంటే శృంగార తార.. ఆమె ఆడల్ట్ సినిమాలు తీసి.. అప్పట్లో కుర్రకారు గుండెలను కొల్లగొట్టింది. మలయాళ ఇండస్ట్రీ నుంచి షకీలా వచ్చారు. ఆ సినిమాలు ఇతర భాషల్లోకి డబ్ చేసేవారు. తర్వాత మాత్రం అలాంటి సినిమాలు చేయలేదు. కాస్తా మంచి పాత్రలను చేసింది. శృంగార తార అనే ఇమేజ్ ఉంది. అలాంటి షకీలను ఈ సారి బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తున్నారట. సో.. షకీలా చేసే హడావిడి.. తోటి కంటెస్టెంట్లతో మసలుకునే విధానం షోకు హైప్ తేనుంది.
షకీలా ఒకవేళ వస్తే.. రచ్చ రచ్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ప్రొఫెషనల్ లైఫ్ గురించి హౌస్లో కంటెస్టెంట్లు మాట్లాడితే.. పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది. స్టార్టింగ్లో షోను జనాలు పెద్దగా చూడరు. సో.. అప్పుడు ప్రేక్షకులను తమ వైపునకు తిప్పుకునేందుకు స్టార్ మా ఇలాంటి ఆలోచన చేసిందని అనేవారు ఉన్నారు. ఒకసారి ప్రేక్షకులకు కనెక్ట్ అయిన తర్వాత.. షకీలాను ఎలిమినేట్ చేసే అవకాశం లేకపోలేదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా కానీ.. బిగ్ బాస్ హౌస్లోకి షకీలను తీసుకురావడం అనేది సాహసమే అని ఇంకొందరు అంటున్నారు. ఇప్పటివరకు షో చూసే.. ఫ్యామిలీ ఆడియన్స్.. షకీలా రాకతో ఆ షోపై అంతగా ఆసక్తి చూపక పోవచ్చు అంటున్నారు. ఇలా షకీలా బిగ్ బాస్ హౌస్లోకి రావడం అనే అంశం చర్చకు దారితీసింది.