టీటీడీ- అటవీశాఖ ఆపరేషన్ చిరుత కార్యక్రమం ముగిసింది. నిన్న రాత్రి నాలుగో చిరుత బోనులో చిక్కింది. కానీ ఏ చిరుత చిన్నారి లక్షితపై దాడి చేసిందనే అంశం మరికొన్ని రోజుల్లో తేలనుంది.
Tirumala: తిరుమలలో మరో చిరుత (Leopard) చిక్కింది. చిరుతను (Leopard) పట్టుకునేందుకు అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిక్కిందని అధికారులు తెలిపారు. ఆ చిరుతను (Leopard) బంధించేందుకు గత కొన్నిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదీ పలుమార్లు బోను వరకు వెళ్లిందని సీసీటీవీ కెమెరాలో కనిపించింది. చివరకు ఆదివారం రాత్రి బోనులో చిక్కిందని వివరించారు. దీంతో ఇప్పటివరకు పట్టుబడిన చిరుతల సంఖ్య నాలుగుకు చేరుకుందని పేర్కొన్నారు.
చిరుతపులుల (Leopard) కోసం టీటీడీ, అటవీశాఖ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. తిరుమల నడకమార్గంలో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి హతమార్చింది. దాంతో టీటీడీ అప్రమత్తం అయ్యింది. తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతపై దృష్టిసారించింది. 7వ మైలు నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్‌గా ప్రకటించింది. ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరి చేసింది. తిరుమల వెళ్లే కాలినడక మార్గంలో 3 ప్రాంతాల్లో బోను ఏర్పాటు చేశారు.
అప్పుడు చిక్కిన 2 చిరుతలు
మోకాలిమిట్ట, లక్ష్మీనరసింహా స్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లను ఉంచారు. 14, 17వ తేదీల్లో రెంచు చిరుతలు బోనులో చిక్కాయి. ఇప్పుడు మరో చిరుత (Leopard) పట్టుబడింది. వన్యప్రాణుల సంచారం కోసం శేషాచల్లం అటవీ ప్రాంతంలో 300 ట్రాప్ కెమెరాలను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. 7వ మైలు మార్గంలో చిరుతను (Leopard) గుర్తించారు. ఆ చిరుతను బంధించేందుకు 9 బోన్లను ఏర్పాటు చేశారు. బోను వద్దకు వచ్చి తిరిగి వెళ్లిపోతుండడాన్ని ట్రాప్ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.
2 నెలల సమయం
చిన్నారి లక్షితపై ఏ చిరుత (Leopard) దాడి చేసిందనే అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. చిన్నారిపై దాడి తర్వాత బోనులో ఉన్న రెండు చిరుతల నమూనాలను ముంబైలోని ల్యాబ్‌కు పంపించారు. ఆ రిపోర్ట్ రావాలంటే 2 నెలల సమయం పడుతోందని అటవీ అధికారులు చెబుతున్నారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత.. చిన్నారిపై దాడి చేసిన చిరుతను (Leopard) జూలో ఉంచి.. మిగతా చిరుతలను అటవీ ప్రాంతంలో వదులుతామని అధికారులు తెలిపారు.