విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తన గళాన్ని వినిపించారు. ఈసారి తాను మాట్లాడుతూ.. కేంద్రానికి డెడ్ లైన్ విధించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను విక్రయించొద్దని తెలిపారు. దీనికి సంబంధించి కేంద్రం అధికారిక ప్రకటన చేయాలన్నారు. లేకపోతే తాను సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కేంద్రాన్ని కేఏ పాల్ హెచ్చరించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటే ఏపీ అప్పులన్నీ తీరిపోతాయని, ఒక్క ఏడాది పాటు స్టీల్ ప్లాంట్ ను అమ్మకుంటే తాను ఆ స్టీల్ ప్లాంట్ను లాభాల బాట పట్టిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం ఏపీకి మొండి చేయి చూపిందని, ఏపీ ప్రజలు కట్టిన పన్నులు గుజరాత్ కు తరలిస్తున్నారని ఆరోపణలు చేశారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే రూ.10 లక్షల కోట్ల అప్పులు తీర్చుతానని, 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానని తెలియజేశారు. పవన్ కల్యాణ్ తనతో చేయి కలపాలని, పవన్ ను తానే గెలిపిస్తానని కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు.