»Lokesh Who Sacrificed On The Wedding Day Yuvagalam Rallies Cake Cutting
Nara Lokesh: పెళ్లిరోజును త్యాగం చేసిన లోకేష్..ర్యాలీలోనే కేక్ కటింగ్
యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ నేత నారా లోకేష్ నూజివీడు నియోజిక వర్గంలో పర్యటిస్తున్నారు. అయితే ఈ యాత్రలో భాగంగా తన పెళ్లి రోజు వేడుకను సైతం యాత్రలో ప్రజల మధ్యలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Lokesh who sacrificed on the wedding day.. Yuvagalam rallies cake cutting
Nara Lokesh: ఏపీ రాజకీయాలు(AP Politics) తారా స్థాయికి చేరుకున్నాయి. అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్షలు చేసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీ(TDP)ని గెలిపించాలని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu), తనయుడు నారా లోకేష్(Nara Lokesh) ఇద్దరు కంకణబద్దులై పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 195వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా ఈరోజు ఏకంగా తన పెళ్లిరోజును కూడా త్యాగం చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే వివాహ వేడుక రోజును కూడా తన యాత్రలోనే కేక్ కట్ చేసి తన భార్యతో జరుపుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్ గారికి మరియు శ్రీమతి నారా బ్రాహ్మణి గారికి 16 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. pic.twitter.com/EhDQPaKpDR
నూజివీడు నియోజవకర్గం పోతిరెడ్డిపల్లిలో లోకేశ్ పర్యటిస్తున్నారు. గ్రామస్థులు తయారు చేసిన గజమాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేశ్, బ్రాహ్మణిల 16వ వివాహ వార్షికోత్సవ వేడుకను ప్రజలు దగ్గరుండి చేయించారు. లోకేష్ కేక్ కట్ చేయగా..స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత నియోజకవర్గంలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం, పిట్టలవారి పాలెం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఏపీ సీఎం జగన్(CM Jagan) దోపిడి పాలనపై లోకేశ్ విమర్షలు గుప్పించారు. దోపిడిపై ఉన్న శ్రద్ధ తాగు, సాగునీటిపై లేదని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.