ఎవరైనా మనకు హైదరాబాద్ అని పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది చార్ మినార్, తర్వాత బిర్యానీ. అయితే ఇప్పటికే భాగ్యనగరంలో బకెట్, కుండ, వెదురు సహా పలు రకాల బిర్యానీలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా బ్రిక్(ఇటుక) మోడల్ బిర్యానీ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఇటుక మోడల్లో ఉన్న పాత్రలో నెయ్యి సహా పలు రకాల పదార్థాలను వేసి ఆర్గానిక్ పద్ధతిలో దీనిని తయారు చేస్తున్నారు. ఇది షాప్ నెం.2, పాత అల్వాల్ రోడ్, VBR గార్డెన్స్, భవానీ నగర్, సికింద్రాబాద్లో ఉంది. పార్సల్ సర్వీసేస్ కూడా ఇస్తున్నారు. ఇక ఎందుకు ఆలస్యం జోమాటో లేదా కుదిరితే అక్కడకు వెళ్లి బ్రిక్ బిర్యానీ ఆరగించండి మరి.