»Turmeric Use More For Side Effects On Liver Human Body
Turmeric: పసుపు తీసుకుంటే ప్రమాదమా..నిపుణుల సూచన!
పసుపు(turmeric) అనేది దేశీ వంటకాలలో ఉపయోగించే ఒక సాధారణ మసాలా. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఆహారానికి పసుపు రంగును ఇవ్వడానికి కూడా పనిచేస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇది ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు చుద్దాం.
turmeric use more for side effects on liver human body
పసుపు అన్ని మసాలాలతో కూడిన ఆహారంలో పసుపు(turmeric) కలుపుతాము. ప్రతిరోజూ పసుపు పాలు తాగే వారు కూడా ఉన్నారు. మరికొంత మంది పసుపును సప్లిమెంట్ రూపంలో ఉపయోగిస్తారు. అయితే ఆస్ట్రేలియన్ ప్రభుత్వం హెల్త్ అండ్ ఏజ్ కేర్ అండ్ థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల పసుపు సప్లిమెంట్లపై ఉమ్మడి సలహాను జారీ చేసింది. పసుపును అధికంగా తీసుకుంటే కాలేయం దెబ్బతింటుందని తెలిపింది. కాలేయ గాయం, పసుపు సప్లిమెంటేషన్ మధ్య లింక్ కనుగొన్నారు. అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించిన 2021 అధ్యయనం ప్రకారం, పసుపు ఉత్పత్తుల వాడకం వల్ల కాలేయం(liver) దెబ్బతిన్నట్లు కొన్ని కేసులు గుర్తించారు.
వ్యక్తిగత వ్యత్యాసం
పసుపు ఆరోగ్యానికి మంచిది. అందువల్ల, పసుపును ఎక్కువ మొత్తంలో తీసుకోవడం అందరికీ మంచిది కాదు. పసుపు ప్రతి వ్యక్తి శరీరంపై వేర్వేరు ప్రభావాన్ని చూపుతుంది. ఇది కొందరిలో కాలేయాన్ని(liver) దెబ్బతీస్తుంది. కాబట్టి పసుపు మీ శరీర స్వభావానికి సరిపోతుందో లేదో చెక్ చేసుకుని వాడండి. మీరు పసుపు సప్లిమెంట్లను తీసుకునేటప్పుడు మీరు దీనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంటుంది.
మోతాదు, నాణ్యతపై జాగ్రత్త
అన్ని పసుపు(turmeric) సప్లిమెంట్లు ఆరోగ్యానికి మంచివి కావు. కొన్ని సప్లిమెంట్లలో కాలుష్యకారకాన్ని ఉపయోగిస్తారు. ఇది మన శరీరాన్ని(body) ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు ఏ సప్లిమెంట్ని ఉపయోగిస్తున్నారు. దాని నాణ్యత ఏంటి, ఎంత మోతాదులో ఉపయోగించాలో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందరికీ సార్వత్రిక మోతాదును సూచించడం సాధ్యం కాదు. పసుపు సప్లిమెంట్స్ సాధారణ మోతాదు రోజుకు 500 నుంచి 2,000 మిల్లీగ్రాముల వరకు ఉంటుందని నిపుణులు అంటున్నారు. కానీ ఎక్కువ మోతాదు మంచి ఫలితాలను ఇస్తుందనేది తప్పు.
వైద్య పరిస్థితి
మీకు ఇప్పటికే కాలేయ సంబంధిత సమస్య ఉంటే పసుపు సప్లిమెంట్లను ఉపయోగించవద్దు. ఇది మీ కాలేయాన్ని మరింత దెబ్బతీస్తుంది. ఈ క్రమంలో మందులను తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు రక్తాన్ని(blood) పలచబరిచే మందులు, మధుమేహం మందులు, యాంటాసిడ్ మందులు తీసుకుంటే దానితో పసుపు సప్లిమెంట్ తీసుకోకండి. దీని వల్ల ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది.
నిపుణుల సంప్రదింపు
స్నేహితులు, బంధువుల నుంచి సలహా తీసుకున్న తర్వాత మనం చాలాసార్లు అలాంటి సప్లిమెంట్లను తీసుకుంటాము. కానీ ఇవి మన శరీరంపై దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ సప్లిమెంట్ తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. మీ శరీర(human body) స్వభావాన్ని వివరించి, ఆపై దానిని ఆహారంలో భాగంగా తీసుకోండి.