TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ప్రధాన నిందితులుగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత శర్మలను 7 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? దీని వెనుక ఉన్న నెట్వర్క్ ఏమిటి? అనే కోణంలో నిందితులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు.