AP: మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మృతి పట్ల లోక్సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ కావూరి మరణ వార్తను సభ దృష్టికి తీసుకువస్తూ దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఆయనకు నివాళులు అర్పించారు. ఉమ్మడి ఏపీ నుంచి పలుమార్లు ఆయన ఎంపీగా గెలిచారు.