రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వస్తున్న ‘ధురంధర్ 2’ ప్రీమియర్స్ రద్దయ్యాయి. మార్చి 18న ప్రీమియర్స్ వేయాల్సి ఉండగా, సెకండ్ హాఫ్‌లో కీలక మార్పుల వల్ల కంటెంట్ ఇంకా థియేటర్లకు చేరలేదు. దీంతో బుక్ మై షో టికెట్లను క్యాన్సిల్ చేసి, 7-8 రోజుల్లో రీఫండ్ చేస్తామని సందేశాలు పంపుతోంది. ఆఖరి నిమిషంలో ఎడిటింగ్ పనుల వల్లే ఈ ఆటంకం ఏర్పడినట్లు సమాచారం.