TPT: శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జాతీయస్థాయి టెక్నో కల్చరల్ ఫెస్ట్ VIRINCHI-2k26 కార్యక్రమం జరుగుతోంది. మూడు రోజుల ఈ కార్యక్రమంలో భాగంగా రెండోరోజు(మంగళవారం) విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అదరగొట్టారు. డాన్స్, సంప్రదాయ దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేశారు.